logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*హత్య కేసులో నిందితునికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు పదివేల జరిమానా.*

*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
ఫిబ్రవరి 27 :-


*శిక్ష విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు.*

*24 మంది సాక్షుల విచారణ.*

*వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు.*

*కేసు దర్యాప్తులో, శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.*

*నిందితుని వివరాలు*
తోరట్ ప్రీతమ్ (36) s/o అశోక్, నివాసం – అంబేద్కర్ నగర్, ఆదిలాబాద్.

*వివరాలలో*

2022 సంవత్సరం జూలై 13 వ తారీకున ఆదిలాబాద్ పట్టణంలో అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఎన్టీఆర్ చౌక్ లో గల దేవి బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా రోడ్డుపై విద్యానగర్ కు చెందిన బాధితుడు గుడ్ల సాయికుమార్ కు మరియు నిందితుడు అంబేద్కర్ నగర్ కు చెందిన తోరట్ ప్రీతం కు మధ్యలో గొడవ జరగగా, నిందితుడు తోరట్ ప్రీతం బాధితున్ని పదునైన ఆయుధంతో ఛాతి భాగం నందు పొడవుగా బాధితుడు అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మరణించడం జరిగింది.

ఈ ఘటనపై మృతుడి తల్లి గుడ్ల స్వాతి w/o లింబాద్రి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పటి సిఐ పి సురేందర్, క్రైమ్ నెంబర్ 215/2022 తో 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తిచేసే కోర్టు నందు చార్జీ సీటు దాఖలు చేయగా, కోర్టు లైసెన్ అధికారి ఎం గంగా సింగ్ ఆధ్వర్యంలో సిడిఓ ఎ రవీందర్ సింగ్ మరియు ఎం అశోక్ లు కోర్టు నందు 24 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, పి పి రహీమ్ గారు సాక్షులను విచారించి నేరము రుజువు చేయించడం జరిగింది.

వాదనలు విన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు నిందితుని పై నేరాన్ని రుజువు చేసి అతనికి ఏడు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు పదివేల జరిమానా విధించడం జరిగింది.

కోర్టు నందు శిక్ష పడడంలో కృషి చేసిన కోర్టులైజర్ అధికారి,సిడిఓ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

కోర్టుల నందు శిక్షలు పడినప్పుడు నేరాలు తగ్గుముఖం పడతాయని, ప్రజలు న్యాయవ్యవస్థపై పోలీసు వ్యవస్థ పై పూర్తి విశ్వాసం ఉంచినందున నిందితులకు సరైన శిక్షలు పడతాయని తెలిపారు.

0
0 views

Comment