తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ
తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* కొత్తగూడెం టౌన్** ఫిబ్రవరి 27 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి రబ్బాని)
*తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ.*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ మరియు సంఘం అసోసియేట్ అధ్యక్షులు గొట్టిముక్కుల మహేందర్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ నార్త్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆపరేషనల్ సర్కిల్ కార్యాలయం, లక్ష్మీదేవిపల్లి వద్ద నిర్వహించబడింది.
ఈ సందర్భంగా గొట్టిముక్కుల మహేందర్ మాట్లాడుతూ, ఉద్యోగులు సేవాభావంతో విధులు నిర్వర్తిస్తూ సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారంతో పనిచేసి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా కృషి చేయాలని సూచించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టి అందరి ప్రశంసలు పొందాలని అన్నారు .
జిల్లా అధ్యక్షులు అనంతుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సంఘం తరఫున తోటి ఉద్యోగులు, పేద విద్యార్థులు మరియు ఆర్థికంగా వెనుకబడిన పద్మశాలి కుటుంబాలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా సంఘం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయడం, అవార్డులు పొందిన ఉత్తమ ఉద్యోగులను సత్కరించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర కార్యాలయం మరియు అన్ని జిల్లా కార్యాలయాల్లో వివాహ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సభ్యుల సహకారంతోనే ఈ సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు . హైదరాబాద్‌లో సంఘానికి స్వంత కార్యాలయ భవనం ఉండి, సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నట్రాజ్, ఆర్గనైజేషనల్ కార్యదర్శి పసునూతి వెంకటేశ్వర్లు, కోశాధికారి పుట్ట లింగమూర్తి, ఉపాధ్యక్షులు వేముల మురళి, కొండి పద్మజ, సంయుక్త కార్యదర్శి పోరండ్ల శ్రీనివాసరావు, ఈసీ సభ్యులు దిగిదారి రాము, అంకం సంతోష్ తదితరులు మరియు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.