logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిందుతలనువెంటనేఅరెస్ట్చేయాలి

పాప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న కులోన్మాదం మతోన్మాదం ఇంకా పెట్రేగిపోతునే ఉందని ఎస్సీ ఎస్టీ, బిసి మైనార్టీల ఎల్లారెడ్డిపేట మండల ఐక్య పోరాట సమితి సలహాదారు
న్యాయవాది పసుల కృష్ణ అన్నారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఐక్య పోరాట సమితి రజక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని గురువారం పెద్ద ఎత్తున నిర్వహించారు,
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్య పోరాట సమితి మండల సలహాదారు న్యాయవాది పసుల కృష్ణ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ లో జరిగిన పాప హత్య కేసులో అక్కడి పోలీసులు 8 మందిపై కేసులు నమోదు చేసి అందులో కేవలం ముగ్గురినే అరెస్టు చూపిన పోలీసులది కంటి తుడుపు చర్య అని ఆయన అన్నారు, 8 మంది పై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపి పాప కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఫిబ్రవరి 18వ తేదీన నాగర్ కర్నూల్ లోని దేవాలయం లోకి రజక కులానికి చెందిన ఆమే ఆమే భర్త కుటుంబ సభ్యులు కలిసి దర్శనానికి వెళ్లగా పెత్తందారులు గుడిలోనికి వెళ్ళకుండా అడ్డుకోవడంతో పాటు ఆమె ప్రశ్నించినందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఆమెను ఆమె భర్తను కొట్టి పాపను తన్నడంతో పాప మరణించిందని ఆ పాప మరణానికి కారకులైన వారిని అక్కడి డిఎస్పి సీఐ ఎస్సై లు హత్య నేరం కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టి బాధితులపైనే కేసులు నమోదు చేయడం ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు గతంలో కులోన్మాదం వల్ల చుండూరు కారంచేడు సంఘటనలు జరిగాయని ఇలాంటి సంఘటనలు జరగకుండా భారత రాజ్యాంగం అమలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు,
భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేవాలయాల్లో దేవుని దర్శించుకునే హక్కు అందరికీ భారత రాజ్యాంగం ప్రకారం కల్పించబడిందన్నారు,
ఎం ఆర్ పి ఎస్ మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ , బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరస కృష్ణా హారి, బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కంచర్ల రాజు మాట్లాడుతూ కులం లేదు మతం లేదు అనే వక్తలు వారికి బుద్ధి చెప్పాలన్నారు,
ఇప్పటికైనా మీ మైండ్ సెట్ ను మార్చుకోని బుద్ధి తెచ్చుకోవాలని వారి హెచ్చరించారు,
చైనా రష్యా ఇతర దేశాలతో పోటీపడే స్థాయిలో ఉన్న భారతదేశం కులోన్మాదం మతోన్మాదంతో పోటీ పడలేమన్నారు,
ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు కంచర్ల నర్సింలు ఎస్సీ ఎస్టీ, బిసి మైనార్టీల ఐక్య కార్యచరణ కమిటీ మండల కన్వీనర్ బండారి బాల్రెడ్డి ప్రతినిధులు కదిరే భాస్కర్ గౌడ్ , సాయి ప్రేమ్ , ఎడ్ల రాజ్ కుమార్ ఎడ్ల సందీప్ , లింగాల సందీప్ , జి మల్లేశం, జి సురేష్ పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అంగూరి ప్రవీణ్, బీపేట మల్లేష్ మందాటి రాజు యాదవ్, మానుక నాగరాజు యాదవ్ దండు శ్రీనివాస్ ముదిరాజ్, రవి జుబేర్, జీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,

25
663 views

Comment