logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆర్జీఎంలో జాతీయ సాంకేతిక సదస్సులు ప్రారంభం.

పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం సిఎస్ఇ, ఈసీఈ విభాగాల ఆధ్వర్యంలో జాతీయ సాంకేతిక సదస్సులు కాంకరెన్స్, సమ్యక్ 2 కే 26 ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులలో 1806 మంది రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో 8 సాంకేతిక సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో పేపర్ ప్రజెంటేషన్, ఏకతాను హ్యాకతాన్, పిసిబి ప్రో, సర్క్యూట్ మైండ్, ఎలక్ట్రో క్వెస్ట్ హంట్ కోడింగ్, ఈవెంట్స్ ప్రాజెక్టు ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సదస్సుల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, నిరంతర అభ్యాసం, సాంకేతిక చైతన్యం అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. నూతన పరిశోధనలకు ఈ సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా సాంకేతిక సదస్సుల సావనీర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ ఈ విభాగం కన్వీనర్లు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, నవీన్ సుందర్, ప్రోగ్రాం డైరెక్టర్ సుబ్బారెడ్డి, ఈసీఈవి భాగం కన్వీనర్లు డాక్టర్ సోఫియా ప్రియదర్శిని, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ చెన్నకేశవులు పాల్గొన్నారు.

0
99 views

Comment