ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి
ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి
TG: బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గుడ్డలు కుక్కేసి, కాళ్లు, చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనమయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్(D) దుండిగల్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. MPకి చెందిన ఈమె భర్తతో కలిసి వలస వచ్చింది.