logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మణుగూరులో నిద్ర మాను వృక్షాల నరికివేతపై అటవీ శాఖ స్పందించాలి - - *ఫారెస్ట్ ఏవో కె.యస్. ఎన్ మూర్తి కి ఫిర్యాదు చేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

*మణుగూరులో నిద్ర మాను వృక్షాల నరికివేతపై అటవీ శాఖ స్పందించాలి*

*కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ ఏవో కె.యస్. ఎన్ మూర్తి కి ఫిర్యాదు చేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు*

మణుగూరు ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేత పై అటవీ శాఖ స్పందించాలని కోరుతూ సోమవారం నాడు జిల్లా ఫారెస్ట్ ఏవో కె ఎస్ ఎన్ మూర్తి కి ఫిర్యాదు చేసినట్లు మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సుమారు యాభై సంవత్సరాలు వయసున్న సింగరేణి ప్రారంభ దిశలో నాటిన నిద్రమాను వృక్షాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నరకించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని. కాండం మరియు కొమ్మలు మాయం చేశారనీ ఆయన ఆరోపించారు, వీటి మీద విచారణ చేసి హరిత చట్టం ప్రకారం వారి మీద తగు చర్యలు తీసుకోవాలని కోరారు . ఈ విషయంపై అటవీ శాఖ స్పందించకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు అంతేకాకుండా పీవీ కాలనీలో అనుమతి లేకుండా నరికించిన ఇతర వృక్షాలపై కూడా విచారణ జరిపించి చెట్లను నక్కకుండా పర్యావరణ పరిరక్షణ తగు చర్యలు చేపట్టాలని కోరారు.

33
1723 views

Comment