ఐ.యల్.పి.ఏ మహిళ న్యాయవాదుల సదస్సు జయప్రదం చేయండి.
ఐ.యల్.పి.ఏ మహిళ న్యాయవాదుల సదస్సు జయప్రదం చేయండి.
కొత్తగూడెం ఫిబ్రవరి 23 (ఏఐఎంఏ మీడియా న్యూస్): ఫిబ్రవరి 28 న హైదరాబాద్ లో జరిగే ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ ఐ.యల్.పి.ఏ తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సు ను జయప్రదం చేయాలని ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాధనాల భానుప్రియ, మహమ్మద్ సాదిక్ పాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జనపరెడ్డి గోపి కృష్ణ ప్రసంగిస్తు మహిళా న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం లో శిక్షణతో పాటు, న్యాయవాదుల సమస్యలు పరిష్కరం కోసం తీస్కునే చర్యలు గురించి చర్చించి నిర్మాణాత్మక నిర్ణయలు తీస్కోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సితక్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు సుజాత ఛౌడంటే తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి లో ప్రముఖ మహిళా న్యాయవాదులు పాల్గొని ప్రసంగింనున్నారని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ భాథ్యులు ఆడపాల పార్వతి, మల్లెల ఉషా రాణి, కాకటి నీలివేణి, గుమ్మడి శాంత, లక్ష్మి సరిత, బేబి షామిలి, నకిరేకంటి ఉమా, న్యాయవాదులు రేపాక మనోరమా, కాటబోయిన స్వర్ణలత, నాగ శ్రావంతి, ఇందిరా ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు