logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైకోర్టు తీర్పు హర్షణీయం తెలంగాణ ఉద్యమకారుడు- పగిళ్ల సందీప్

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు వారి న్యాయమైన డిమాండ్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25 వేల రూపాయల పెన్షన్ 8 వారాల లోపు అమలు చేయాలని సోమవారం హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ ఉద్యమకారుడు పగిళ్ల సందీప్ హర్ష్యం వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల త్యాగాలు చరిత్రలో లిఖించబడతాయి అని దీనికి నిదర్శనం హైకోర్టు తీర్పు అని ఈ సందర్భంగా హైకోర్టులో పిటిషన్ వేసిన తెలంగాణ ఉద్యమకారులకు సందీప్ కృతజ్ఞతలు తెలిపారు.

10
664 views

Comment