భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా బుర్ర కొమురయ్య
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి, అనంతరం మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ లను అభినందించారు.