logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 23 ఈరోజు 131 - కుత్బుల్లాపూర్ డివిజన్ ఎమ్ ఎన్ రెడ్డి నగర్

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 23 ఈరోజు 131 - కుత్బుల్లాపూర్ డివిజన్ ఎమ్ ఎన్ రెడ్డి నగర్ ఫేస్ -1 నూతన సంక్షేమ సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ.... ఎమ్.ఎన్.రెడ్డి నగర్ ఫేస్ -1 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మూడవసారి ఎన్నికైన సంపత్ గౌడ్ మరియు సంక్షేమ సంఘం సభ్యులకు అభినందనలు. గత 12 ఏళ్ల కాలంలో ఎమ్ ఎన్ రెడ్డి నగర్ ఫేస్ 1 కాలనీలో మౌలిక వసతుల కల్పనలో సంక్షేమ సంఘం మా దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పరచామని రానున్న రోజుల్లో కూడా కాలనీ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.


ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు సంపత్ గౌడ్, కార్యవర్గం సభ్యులు రవీందర్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, శివకృష్ణ, చిదంబర శాస్త్రి, రమేష్, వీరా చారి తదితరులు పాల్గొన్నారు

3
412 views

Comment