logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బైక్ పై వెళ్లేవారు రైటర్ మరియు పిలిఎన్ రైడర్లకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి , *రహదారి భద్రతపై నిరంతర అవగాహన ఎస్సై అఖిల,

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** అశ్వరావుపేట టౌన్** ఫిబ్రవరి 23**( ఏఐఎంఈ మీడియా ప్రతినిధి)

Arrive Alive కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ప్రధాన లక్ష్యమని, రహదారి భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్సై అఖిల తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో Arrive Alive Phase–2 కార్యక్రమం విస్తృతంగా నిర్వహించబడింది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల్లో భద్రతా ప్రమాణాలపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ సెంటర్, విద్యాసంస్థల సమీప ప్రాంతాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద ప్రత్యేకంగా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు. వాహనాలను ఆపి రైడర్లు, పిలియన్ రైడర్లకు హెల్మెట్ ధరించుట వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా వివరించారు. ప్రమాద సమయంలో తలకు గాయాలు ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, హెల్మెట్ ధరించడం ద్వారా తీవ్ర గాయాలను నివారించవచ్చని అధికారులు తెలియజేశారు.

అశ్వారావుపేట ఎస్సై అఖిల మాట్లాడుతూ, రైడర్ మాత్రమే కాకుండా పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాలి అని చట్టం చెబుతుందని గుర్తు చేశారు. చాలాసార్లు వెనుక కూర్చున్నవారు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదాల్లో తీవ్ర గాయాలు జరుగుతున్నాయని, ఈ నిర్లక్ష్యాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై కూడా ప్రత్యేక అవగాహన కల్పించారు. అధిక వేగం, మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. యువతలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాటు పెంపొందించాల్సిన అవసరం ఉందని, ప్రతి వాహనదారుడు తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఐఎస్ఐ మార్క్ ఉన్న నాణ్యమైన హెల్మెట్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. హెల్మెట్‌ను సరైన విధంగా ధరించడం, స్ట్రాప్ బిగించడం ఎంత ముఖ్యమో ప్రదర్శన ద్వారా చూపించారు. కొన్ని సందర్భాల్లో హెల్మెట్ ధరించని వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసి, వెంటనే హెల్మెట్ ధరింపజేశారు. అవగాహన కార్యక్రమం అనంతరం కూడా నిర్లక్ష్యం కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై అఖిల హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.

40
2275 views

Comment