భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత: రోగుల అవస్థలు
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ
ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా బాత్రూంలలో నీటి సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. వాష్‌రూమ్స్‌లో దుర్వాసనతో పాటు త్రాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలు అందాల్సిన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. పక్కనే కలెక్టర్ కార్యాలయం ఉన్నా అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తూ, సమస్యను తక్షణమే పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.