బాగ్ అంబర్పేట్లో Chhatrapati Shivaji Maharaj జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీపై జరిగిన దాడిని తీవ్రంగా
బాగ్ అంబర్పేట్లో Chhatrapati Shivaji Maharaj జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటనకు నిరసనగా ఈ రోజు హిందూ సంఘాల నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించగా, అవి జరగకుండా ఉండేందుకు ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని అభిప్రాయపడుతున్నాము.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి హక్కు. ఆ హక్కును వినియోగించుకునే అవకాశమే లేకుండా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తుంది. జీడిమెట్ల పోలీసులు ఎటువంటి రాజకీయ ప్రభావం లేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అనే ఆశ ప్రజల్లో ఉంది.
హిందువులు సహా అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచుకునే స్వేచ్ఛ ఉండాలి. సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, చట్టబద్ధ మార్గంలోనే మన హక్కులను సాధించే దిశగా ఐక్యంగా ముందుకు సాగాలి.