logo

మర్రి నరేష్ నేటి ప్రధాన వార్త : 'ఫిబ్రవరి 20 2026' భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులు అత్యంత ముఖ్యమైనవి


రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు వివరించారు వీటిని "భారతదేశ మహాశాసనం" (Magna Carta of India) అని పిలుస్తారు
​ప్రస్తుతం 6 ప్రధాన ప్రాథమిక హక్కులు ఉంట్టాయి

​సమానత్వపు హక్కు (Right to Equality)

​ఆర్టికల్స్: 14 - 18
అందరూ చట్టం ముందు సమానులే అని ఈ హక్కు చెబుతుంది
​ఆర్టికల్ 14: చట్టం ముందు సమానత్వం
​ఆర్టికల్ 15: మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా వివక్ష చూపకూడదు
​ఆర్టికల్ 16: ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు
​ఆర్టికల్ 17: అస్పృశ్యత (Untouchability) నివారణ
​ఆర్టికల్ 18: బిరుదుల రద్దు (Titles)


​స్వాతంత్ర్యపు హక్కు (Right to Freedom)

​ఆర్టికల్స్: 19 - 22
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఇది కాపాడుతుంది
​ఆర్టికల్ 19: వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ (ఇందులో 6 రకాల స్వేచ్ఛలు ఉంటాయి)
​ఆర్టికల్ 20: నేరాలకు సంబంధించి శిక్షల నుండి రక్షణ
​ఆర్టికల్ 21: జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ
​ఆర్టికల్ 21A: 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య
​ఆర్టికల్ 22: అక్రమ అరెస్టులు, నిర్బంధం నుండి రక్షణ

పీడనాన్ని నిరోధించే హక్కు (Right against Exploitation)

​ఆర్టికల్స్: 23 - 24
బలహీన వర్గాలను దోపిడీ నుండి రక్షించే హక్కు
​ఆర్టికల్ 23: మనుషుల అక్రమ రవాణా, వెట్టిచాకిరీ నిషేధం
​ఆర్టికల్ 24: కర్మాగారాల్లో బాలకార్మిక వ్యవస్థ నిషేధం

మత స్వాతంత్ర్యపు హక్కు (Right to Freedom of Religion)

​ఆర్టికల్స్: 25 - 28
ప్రతి పౌరుడు తనకిష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ
​ఆర్టికల్ 25: ఏ మతన్నైనా స్వీకరించే, ప్రచారం చేసే స్వేచ్ఛ
​ఆర్టికల్ 26: మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు
​ఆర్టికల్ 27: మత ప్రచారం కోసం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు
​ఆర్టికల్ 28: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతబోధన నిషేధం

​విద్యా, సాంస్కృతిక హక్కులు (Cultural and Educational Rights)

​ఆర్టికల్స్: 29 - 30
అల్పసంఖ్యాక వర్గాల (Minorities) ప్రయోజనాలను కాపాడటం
​ఆర్టికల్ 29: అల్పసంఖ్యాక వర్గాల భాష, లిపి, సంస్కృతి రక్షణ
​ఆర్టికల్ 30: విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు

రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies)

​ఆర్టికల్: 32
ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు

​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ హక్కును "రాజ్యాంగపు ఆత్మ హృదయం" అని వర్ణించారు.

ప్రారంభంలో రాజ్యాంగంలో ఆస్తి హక్కు (Right to Property - Article 31) కూడా ప్రాథమిక హక్కుగా ఉండేది. కానీ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి, ఆర్టికల్ 300A కింద సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్చారు

29
2101 views