
వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను టార్చర్ పెట్టిన ప్రభుత్వ విప్,
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను టార్చర్ పెట్టిన ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పీఏ
భర్త వేదింపులు తట్టుకోలేక అనుమానాస్పద స్థితిలో భార్య మృతి
అధికార పార్టీ, డబ్బు బలంతో కేసు క్లోజ్ చేయిస్తున్న ఆది శ్రీనివాస్
వేములవాడ పట్టణంలో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆది శ్రీనివాస్ పీఏ దినేష్ గౌడ్ భార్య రోహిణి(32)
8 సంవత్సర క్రితం పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంగళ దినేష్ గౌడ్
నిత్యం ఇతర మహిళలతో తిరుగుతూ భార్య రోహిణిని కొట్టి, చిత్రహింసలకు గురి చేసిన దినేష్ గౌడ్
కాగా నిన్న ఉదయం రోహిణి ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తన పలుకుబడిని ఉపయోగించి 60 మంది పోలీసుల బెటాలియన్ను దించిన దినేష్ గౌడ్
రోహిణి శరీరంపై చాలా చోట్ల దెబ్బలు ఉండగా, దినేష్ మరియు అతని కుటుంబసభ్యులు ఆమెను చంపేసి, ఉరేసి ఆత్మహత్య కోణంలో చిత్రీకరించారని ఆరోపించిన ఆమె కుటుంబసభ్యులు
ఆది శ్రీనివాస్ దగ్గర పీఏగా చేయడం వల్ల దినేష్ గౌడ్ తన పలుకుబడితో పోలీస్ బలగాలను సెక్యూరిటీగా ఉపయోగించి, తమను భయబ్రాంతులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేసిన రోహిణి కుటుంబసభ్యులు
కాగా దినేష్ గౌడ్ గత ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ గెలుపు కోసం ధనసాయం చేశాడని, దీంతో రోహిణి అనుమానాస్పద మృతిని ఆత్మహత్యలా చిత్రీకరించారని ఆరోపణలు