logo

బిజెపిఆధ్వర్యంలో చత్రపతిశివాజీజయంతి వేడుకలు

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు,

రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా, నిర్వహించారు
​మండల అధ్యక్షులు మిర్యాల్‌కార్ బాలాజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ విగ్రహానికి , పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం శివాజీ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు
ఇట్టి కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు చింతల పరశురాం, నాయకులు చీకటి మధు, విజయ్, దుర్ల శంకర్, శంకర్, పిల్లి వెంకటి, బాలరాజు, పారలి శ్రీనివాస్ మరియు హిందూ బంధువులు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

15
1016 views