పేటీఎం సంస్థలో ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 21న ఉపాధి మేళా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న శనివారం ఉపాధి మేళా నిర్వహించబడుతుంది. కొత్తగూడెం పట్టణంలోని రామాలయం ఎదురుగా ఉన్న మండల అభివృద్ధి అధికారి కార్యాలయం సమీపంలోని బాబూ క్యాంపు వద్ద ఈ ఉపాధి మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. పేటీఎం సంస్థలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు మొత్తం 40 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు 18,000 నుండి 22,000 రూపాయల వరకు వేతనం అందించబడుతుంది. కొత్తగూడెం, పాల్వంచ, యెల్లందు, భద్రాచలం ప్రాంతాల్లో పనిచేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటల నుండి తమ విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో హాజరై పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7660021945 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.