logo

*రూ.10.8 లక్షల విలువైన 30 టన్నుల బియ్యం*రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత*....

*రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత.*రూ.10.8 లక్షల విలువైన 30 టన్నుల బియ్యం*రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సమాచారం రావడంతో....శివ శంకర్. చలువాది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఎస్సై జి నరేష్ పట్టుకున్నారు. 30 టన్నుల బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు. వాటిని పట్టుకుని ఆరా తీయగా రేషన్ బియ్యంగా వెల్లడయింది.విజయవాడ సమీపం నుంచి ఈ బియ్యాన్ని తీసుకొస్తున్నారు.ఈ బియ్యం విలువ సుమారు రూ. 10.8 లక్షలు ఉంటుంది. దీనిపై ఎస్ఐ నరేష్ బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఆకుల శివకృష్ణ మణికంఠ ను అరెస్టు చేశారు.కాకినాడకు చెందిన కె.చంద్రశేఖర్‌కు చెందిన లారీ గా గుర్తించారు. అయితే ఈ బియ్యం కాకినాడ వెళుతున్నట్లు వారు చెబుతున్నారు. కాని కోస్తా జిల్లాలోనే రేషన్ బియ్యం కొనుగోలు కేంద్రంగా ఉన్న ఆలమూరు మండలం మోదుకూరు రైస్ మిల్లులకు ఈ బియ్యం వస్తున్నట్లు సమాచారం.ఈ బియ్యాన్ని మండపేట మండలం వేములపల్లి గౌడౌన్ లో దిగుమతి చేసి లారీని ఆలమూరు పోలీసు స్టేషన్ కు తరలిస్తామబి మండల సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

0
57 views