logo

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను తనిఖీ చేస్తున్న డి ఎం హెచ్ ఓ *ప్రజలకు వైద్య సిబ్బంది అంకిత భావంతో వైద్య సేవలు అంద

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఇల్లందు** ఫిబ్రవరి 17 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను తనిఖీ చేస్తున్న డి ఎం హెచ్ ఓ

*ప్రజలకు వైద్య సిబ్బంది అంకిత భావంతో వైద్య సేవలు అందించాలి,

*అత్యవసర వైద్య కేసులకు ప్రాథమిక వైద్యం అందించి వెంటనే దగ్గర్లోని ఏరియా హాస్పిటల్స్ కు తరలించాలి,


*మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్సీలోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి,



*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్,

కొత్తగూడెం, ఫిబ్రవరి 17:( ఏఐఎంఏ న్యూస్ జిల్లా ప్రతినిధి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) ఇల్లందు పట్టణంలోని పల్లె ధవాఖాన సబ్ సెంటర్ ను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు, ఆరోగ్య సూచికలను మెరుగు పరచాలని సిబ్బందికి ఆదేశించారు.అనంతరం యూఎఫ్‌డబ్ల్యూసీ యెల్లందు మరియు రొంపేడు, కొమరారం, గుండాల, సులహానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs)కు చెందిన MPHA(F)లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా:ఎన్‌సీడీ (NCD) స్క్రీనింగ్ నవీకరణలు అనీమియా ముఖ్త్ భారత్ కార్యక్రమం సమర్థ సొంతంగా అమలు చేయాలని అదేవిధంగా సమతుల్య ఆహారం ప్రాముఖ్యత“ఈట్ రైట్ – డ్రింక్ రైట్” పై అవగాహన కలిగించాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఆరోగ్య కార్యక్రమాల సూచికల్లో పురోగతి సాధన వంటి అంశాలపై దృష్టి సారించాలని అన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
ఈకార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మధువారన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, మోహన్ డిపిఎమ్ఓ మరియు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు

183
5715 views