logo

జిల్లా వ్యాప్తంగా క్షయ (టీబి)నివారణకు పటిష్టమైన చర్యలు *డీఎంహెచ్వో డాక్టర్ తుకారం రాథోడ్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వి సుబ్బారావు ,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**(ఫిబ్రవరి 17 )ఏఐఎంఏ మీడియా ప్రతినిధి

జిల్లా వ్యాప్తంగా క్షయ (టీబి)నివారణకు పటిష్టమైన చర్యలు
*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వి సుబ్బారావు ఎండి (పల్మనాలజిస్ట్)

కొత్తగూడెం, ఫిబ్రవరి 17:( ఏఐఎంఏ న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నివారణ అధికారి (ఖమ్మం) డాక్టర్ వి. సుబ్బారావు, ఎండి (పలమనాలజిస్ట్) చే జిల్లా పిహెచ్ఎస్సి వైద్యాధికారులకు మరియు ఎన్టిఈపి సిబ్బందికి డిఫరెన్షియల్ టిబి కేర్ కార్యక్రమం మీద శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం మంగళవారం నాడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా టీబి(చే దగ్గు) పేషెంటుకు డెత్ మానిటరీ రేట్ తగ్గించుట కొరకు ప్రతి టీబి పేషెంటుకు ప్రతినెల పిహెచ్సి స్థాయిలో మరియు టి హబ్ లో ఉన్న అన్ని రకాల వైద్య పరీక్షలు టీ హబ్ ద్వారా పరీక్షలు చేయించాలని ప్రతినెల టీబి కేసులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. దీనికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వైద్యులకు ప్రతినెల 1వ తారీఖున టీబి పేషెంట్స్ అన్ని రకాల టెస్టులు పిహెచ్సి లలో నిర్వహించ వలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో , ఖమ్మం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ పుల్లారెడ్డి మరియు జిల్లా వైద్యాధికారులు. ఎన్టీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

19
1167 views