logo

న్యాయ పరిరక్షణ చైతన్య సంస్థ జిల్లా అధ్యక్షుడిగా సుగాలి హరిలాల్ నాయక్....

న్యాయ పరిరక్షణ చైతన్య సంస్థ జిల్లా అధ్యక్షుడిగా సుగాలి హరిలాల్ నాయక్ నియామకంతిరుపతి, ఆర్&బి గెస్ట్ హౌస్: న్యాయ పరిరక్షణ చైతన్య సంస్థ ® సత్య సాయి జిల్లా అధ్యక్షుడిగా సుగాలి హరిలాల్ నాయక్‌ను నియమించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మేడా లోకేష్ అందజేశారు.ఈ సందర్భంగా సుగాలి హరిలాల్ నాయక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి సత్య సాయి జిల్లా బాధ్యతలను అప్పగించినందుకు మేడా లోకేష్ కీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజలకు నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, శిబిరాలు నిర్వహించి ప్రజలకు చట్టాలపై స్పష్టమైన సమాచారం అందించనున్నట్లు తెలిపారు. ఈ నియామకం పట్ల జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

0
46 views