logo

నూతన కమిషనర్ జశ్వంత్ రావు ఎమ్మెల్యే దగ్గుపాటి సూచన*....

*నగరపాలక సంస్థలో అవినీతి అన్న మాట వినిపించకూడదు*నూతన కమిషనర్ జశ్వంత్ రావు ఎమ్మెల్యే దగ్గుపాటి సూచన*

*ఎమ్మెల్యే దగ్గుపాటితో కమిషనర్ మర్యాదపూర్వక భేటీ*పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశం*
- నగరపాలక సంస్థలో అవినీతి అన్న మాట వినిపించకుండా పని చేయాలని నూతన కమిషనర్ జశ్వంత్ రావుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. ఇటీవల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జశ్వంత్ రావు ఎమ్మెల్యే దగ్గుపాటితో ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా నగరంలో ప్రజా సమస్యలపై చర్చించారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల మీద ప్రత్యేకంగా ప్రస్తావించారు. నగరంలోని శివారు కాలనీలతో సహా అన్ని చోట్లా పారిశుద్ధ్యంపై మెరుగైన సేవలందించాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు. సిబ్బంది పని తీరు మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నగరపాలక సంస్థలోని ఏ విభాగంలో కూడా అవినీతి అన్న ఆరోపణలు కూడా ఉండకూడదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఎక్కడా రాజీ పడవద్దని ఎమ్మెల్యే ఆదేశించారు.

0
77 views