logo

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*



*పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
- *విద్యా శాఖ పరిధిలో పదవ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పదవ తరగతి, ఏపీఓఎస్ఎస్ ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*

- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు చాలా ముఖ్యమైనవని, విద్యార్థినీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, మార్చి - 2026 పరీక్షలను మార్చి 16వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ / ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏపీఓఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఎస్ఎస్సి పరీక్షలను మార్చి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 592 పాఠశాలలకు చెందిన 33,260 మంది విద్యార్థులు, 71 ఏపీఓఎస్ఎస్ స్కూల్స్ కు చెందిన 1,045 మంది విద్యార్థులు మొత్తం 143 పాఠశాలల్లో పరీక్షలను రాయనున్నారని తెలిపారు. అలాగే ఏపీఓఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, మార్చి- 2026 కు సంబంధించి 38 ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ స్కూల్స్ కి చెందిన 2,479 మంది విద్యార్థులు జిల్లాలో 9 కేంద్రాలలో మార్చి 2వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.*

- *పరీక్షలు జరిగే సమయంలో అవసరమైన ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, ఇందుకోసం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఖచ్చితంగా ఉండాలని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పక్కాగా పరీక్షలను నిర్వహించాలన్నారు.*

- *ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మలోల, డిఈఓ ప్రసాద్ బాబు, ఇంటర్మీడియట్ కన్వీనర్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటి మరియు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యం.వెంకటరమణ నాయక్, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, నగరపాలక సంస్థ ఈఈ షాకీర్, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ మహబూబ్ భాష, లేబర్ డిసి లక్ష్మీ నరసయ్య, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

0
12 views