
అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు
*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం "ప్రగ్యాన్ -2K26" పేరుతో అవంతి విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక గారు అధ్యక్షతన జాతీయస్థాయి సాంకేతిక ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులతో కలిసి అవంతి క్రోనికల్ న్యూస్ లెటర్ విడుదల చేశారు.అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కె.వి.జి.డి బాలాజీ గారు,డైరెక్టర్ ఐఐఐటి శ్రీకాకుళం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సాంకేతిక ఉత్సవం విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ఒక గొప్ప వేదికని తెలుపుతూ విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానంతోనే కాకుండా,ఆవిష్కరణాత్మక ఆలోచనలు,సృజనాత్మకత మరియు పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలిని తెలుపుతూ ఈ ఉత్సవం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని తెలియజేశారు.మరియు క్వాంటం కంప్యూటర్ భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని పూర్తిగా మార్చగల శక్తివంతమైన సాంకేతికతని తెలుపుతూ ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ,రాబోయే సంవత్సరాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదుని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా బి.సురేష్ కుమార్ సైంటిస్ట్-ఎఫ్ NSTL DRDO,విశాఖపట్నం నుండి విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలుపుతూ విద్యార్థులు దానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా కె.కిషోర్ కుమార్ గ్రూప్ మేనేజర్,ఇన్ఫోసిస్ విశాఖపట్నం నుండి విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ అభివృద్ధికి సాంకేతికత ప్రధాన శక్తిగా నిలుస్తోంది.అందువల్ల యువత సృజనాత్మక ఆలోచనలు మరియు ఆవిష్కరణలతో ముందుకు రావాలిని తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎమ్.లక్ష్మీ ప్రియాంక గారు,జనరల్ సెక్రెటరీ అవంతి విద్యాసంస్థలు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న దృక్పథంతో ఈ కాలేజీ స్థాపించబడిందని తెలియజేశారు.మరియు మానసిక ఒత్తిడి తగ్గుదల, ఏకాగ్రత కోసం ప్రతి విద్యార్థి మెడిటేషన్ చేయాలని కోరారు.మరియు క్వాంటం ఇంజనీరింగ్ అనేది భవిష్యత్తు సాంకేతిక విప్లవానికి మూలాధారం అని తెలియజేశారు కావున విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బ్రహ్మకుమారి హేమలత,గరివిడి నుండి విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బ్రహ్మకుమారి హేమలత,గరివిడి నుండి విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా,సమాజ అభివృద్ధికి కూడా గొప్ప దోహదం చేస్తుంది.అయితే సాంకేతిక పురోగతితో పాటు మన ఆలోచనలు,విలువలు మరియు ఆత్మీయత కూడా అభివృద్ధి చెందాలిని తెలియజేశారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించే విధంగా వివిధ సాంకేతిక ప్రాజెక్ట్ ఎక్సపోస్,పోస్టర్ ప్రజెంటేషన్స్,పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మరియు హేకధాన్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా విద్యార్థుల వారి యొక్క సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించారని తెలిపారు.అనంతరం అతిధులు ఈ సాంకేతిక ఈవెంట్స్ ను సందర్శించి విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి కీనోట్ స్పీకర్ గా డాక్టర్ సి.నీలిమ దేవి అసోసియేట్ ప్రొఫెసర్,మెకానికల్ విభాగం జేఎన్టీయూ గురజాడ,విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మెకానికల్ విభాగంలో అధునాతనాతన సాంకేతికపై ఉపన్యాసం ఇచ్చారు.ఈ కార్యక్రమానికి మరో కీనోట్ స్పీకర్ గా డాక్టర్ సిహెచ్.బిందు మాధురి అసోసియేట్ ప్రొఫెసర్,ఐటి విభాగాధిపతి,జేఎన్టీయూ గురజాడ,విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఏ.ఐ ఏజెంట్లు మరియు స్వయంప్రతిపత్తి వ్యవస్థలు పై
ఉపన్యాసం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల ప్రెసిడెంట్ ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి గారు,వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.