logo

సాధారణ భక్తులతో కలిసి వెళుతున్న  జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.

శ్రీశైలం (AIMA MEDIA): శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఉచిత క్యూ లైన్ ద్వారా సాధారణ భక్తులతో కలిసి వెళ్లి సుమారు 20 నిమిషాల్లో దర్శనం చేసుకున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, ఉచిత దర్శన క్యూ లైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశిస్తూ ఇబ్బందులను భక్తులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.ప్రత్యేక దర్శనాల కంటే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, ఉచిత క్యూ లైన్ ద్వారా తక్షణ దర్శనం కల్పించిన దేవస్థాన అధికారులు. భక్తులు శాంతి, నియమ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్.

1
12 views