logo

భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయ.

*శుక్రవారం రోజు (13.02.2026) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం లో స్వామివారు, అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులతో కలిసి క్యూలైన్లో వెళ్లి స్వామివారి ఉచిత లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా *
భక్తులతో పాటు క్యూలైన్లో నిలబడి లడ్డు ప్రసాద కౌంటర్ల వద్ద కొనుగోలు జరుగుతున్న విధానం, టోకెన్ వ్యవస్థ, సరఫరా ప్రక్రియలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.అదే క్యూలైన్లో భక్తులతో కలిసి వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున సమేత స్వామివారి అన్నదాన సత్రంలో సహపంక్తిగా కూర్చొని భోజనం చేస్తూ, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత, వడ్డింపు విధానాలపై భక్తులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.

49
6033 views