డాక్టర్ కేతవత్ స్వప్న ఘనవిజయం..
కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ అభ్యర్థిని
కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ అభ్యర్థిని డాక్టర్ కేతవత్ స్వప్న తన సమీప ప్రత్యర్థిపై 367 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గతంలో ఇక్కడ నుంచి గోబ్రియా నాయక్ 3 సార్లు వరుసగా విజయం సాధించగా, 2020లో మాత్రం సీపీఐ గెలుపొందింది. తాజా ఫలితంతో ఈ డివిజన్ లో కాంగ్రెస్ మళ్లీ పట్టు నిరూపించుకుంది