logo

12/02/2026 తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజవర్గం, కోడూరు పట్టణ గ్రామ సచివాలయం నందు భారత విప్లవ మార్క్ లిస్ట్ ట్రేడ్ యూనియన్

12/02/2026
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజవర్గం,
కోడూరు పట్టణ గ్రామ సచివాలయం నందు భారత విప్లవ మార్క్ లిస్ట్ ట్రేడ్ యూనియన్ తిరుపతి జిల్లా కన్వీనర్ దాసరి జయచంద్ర ఆధ్వర్యంలో దాదాపు పంచాయితీ పరిధిలో ఉన్నటువంటి 66 మంది పైగా ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యల గురించి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు రెండవ రోజు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఇంచార్జ్ గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య, పుల్లంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిగమాల రమేష్, రైల్వే కోడూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళి కృష్ణ, పెనగలూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ నాయకులు శాంతయ్య మాట్లాడుతూ రైల్వే కోడూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి స్వచ్ఛభారత్ కార్మికులు కు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పిఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, అలాగే స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి 8 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే పెరుగుతున్నటువంటి జనాభా ప్రాతిపతికన కార్మికుల సంఖ్య కూడా పెంచాలని, అలాగే కార్మికుల సంబంధించి పనిముట్లు సోపులు శానిటైజరీ వస్తువులు కొబ్బరి నూనె వంటివి తగిన మోతాదులో ఇవ్వాలని తెలిపారు లేని పక్షంలో ఆందోళనలో తీవ్రతరం చేసి ఉద్యమాలు ఉధృతం చేసి అన్ని రాజకీయ పక్షాలు కలుపుకొని జిల్లా అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం టి యు అసెంబ్లీ కన్వీనర్ ఎస్ చెన్నయ్య అధ్యక్షురాలు ఆర్ పెంచలమ్మ, ఆర్ పెంచలయ్య, కే రాణమ్మ, జి రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

12
980 views