కోన ఊపిరిలో ఉన్న బాలుడికి కొండంత అండగా నిలిచిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు
తెలంగాణ స్టేట్ *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* భద్రాచలం ఏరియా హాస్పిటల్ *ఫిబ్రవరి 12*( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి) కోన ఊపిరిలో ఉన్న బాలుడికి కొండంత అండగా నిలిచిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు కేవలం ఒక గ్రాము రక్తం తో ఉన్న బాలుడి కి గోల్డెన్ హౌర్ లో చికిత్స చేసి ఊపిరి పోసిన వైద్యులు తన కార్యాలయానికి బాలుడితో పాటు చికిత్స చేసిన వైద్యులను పిలిపించి ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ ********** చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఒక గిరిజన బాలుడు కోన ఊపిరి తో మృత్యుతో పోరాడి క్షేమంగా ఇంటికి చేరిన ఘటన భద్రాచలం ఏరియా ఆసుపత్రి లో చోటుచేసుకుంది. వారం పాటు చికిత్స అందించిన అనంతరం సురక్షితంగా వైద్యులు ఆసుపత్రి నుండి నేడు డిస్చార్జ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కిష్టారం గ్రామానికి చెందిన రెండున్నర సంవత్సరాల మల్లం నరేష్ అనే బాలుడు కి తీవ్రమైన ఆయాసం, పొట్ట ఉబ్బడం , వొళ్ళంతా మచ్చలు, జ్వరం, తీవ్ర బలహీనత తో ఈ నెల ఐదవ తారీఖున భద్రాచలం ఆసుపత్రి లో చేరాడు. ఆ బాలుడిని పరీక్షించిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి బాలుడికి తీవ్ర రక్తహీనత ఉందని గమనించి రక్త పరీక్షలు నిర్వహించగా కేవలం ఒక గ్రామం కంటే కూడా తక్కువ శాతం రక్తం ఉందని , రక్ష పరీక్షలకు సైతం రక్తం నరాల నుండి తీసే అవకాశం లేదని తెలిపారు. సహజంగా ప్రతి ఒక్కరికి రక్తం పది నుండి పద్నాలుగు గ్రాములు ఉండాలి. కానీ ఈ బాలుడికి కేవలం ఒక గ్రాము కంటే తక్కువ రక్తం మాత్రమే ఉన్న విషయం తెలుసుకొని వైద్యులు విస్తుపోయారు. గోల్డెన్ హౌర్ లో ఎటువంటి ఆలస్యం చేయకుండా బాలుడిని ఇతర ఆసుపత్రులకు తరలించి ఉన్న సమయాన్ని వ్యర్థం చేయకుండా వెంటనే చికిత్స ప్రారంభించారు. సరిపడా అన్ని రకాల నాణ్యమైన చికిత్స అందించి రక్త శాతాన్ని ఒక గ్రాము నుండి 8 గ్రాములకు పెంచి అతడి ప్రాణాలు కాపాడారు. సహజంగా ఇటువంటి క్లిష్టమైన వ్యాధులకు హైదరాబాద్ లోని నిలోఫర్ లాంటి పెద్ద ఆసుపత్రులు, లేదా పెద్ద కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులలో చికిత్స అందిస్తారు. కానీ భద్రాచలం ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడి కుటుంబ నిస్సహాయత ని గుర్తించి ఎంతో నిబద్ధత తో అతని ప్రాణాలు నిలపెట్టారు. డి సి హెచ్ ఎస్ రవిబాబు ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బాలుడిని, చికిత్స చేసిన వైద్య బృందాన్ని పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ప్రజలకు అందులోనూ ముఖ్యంగా గిరిజనులకు భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఒక సంజీవని గా పనిచేస్తుందని. క్లిష్టమైన రోగాలకు సైతం కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి సిబ్బంది ఎంతో నేర్పుతో చికిత్స అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని ఆయన సిబ్బంది సేవలను కొనియాడారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ నేతృత్వంలో భద్రాచలం ఆసుపత్రి సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారనీ,భద్రాచలం ఆసుపత్రికి ఎటువంటి అవసరాలున్నా కూడా తన వంతు సహకారం అన్ని రకాలుగా ఉంటుందని తెలిపారు. చికిత్స చేసిన బృందం లో డా.రాజశేఖర్ రెడ్డి,డా.క్రాప విజయ్ మరియు హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. తల్లి లేని ఆ బాలుడికి ఆరేళ్ల అక్క ఒక్క తల్లి లాగా అక్కున చేర్చిన విషయం తెలుసుకొని ఆ అక్క తమ్ముళ్ళని జిల్లా కలెక్టర్ ఆప్యాయతగా పలకరించి భరోసా కల్పించారు.పలు బలవర్ధక పోషక పదార్థాలను ఇచ్చి పంపించారు.