శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఆనం రామనారాయణరెడ్డి
*రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాల సమర్పణ* మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఐదవ రోజు గురువారం(12.02.2026) సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి,స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమంలో దేవదాయ కమిషనరు, కె. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా,చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ , ధర్మకర్తల అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు వారు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమములో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం, వస్త్రాలకు పూజాదికాలు మొదలైన కార్యక్రమాలునిర్వహించబడ్డాయిఅనంతరం మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులవారు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణ పూర్వకంగా స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాగా ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైలక్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి.ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి మరియు దసరా మహోత్సవాలలోనూ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.