logo

ఉద్దీపకం వర్క్ బుక్ టు లోని అంశాలు అర్థమయ్యేలా బోధించాలి *ఐటీడీఏ పీవో బి రాహుల్,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** భద్రాచలం ఐటీడీఏ**ఫిబ్రవరి 12 **(ఏఐఎంఎం మీడియా ప్రతినిధి)


ఉద్దీపకం వర్క్ బుక్ టు లోని అంశాలు అర్థమయ్యేలా బోధించాలి

*ఐటీడీఏ పీవో బి రాహుల్,


భద్రాచలం, ఫిబ్రవరి 12:
గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నడపబడుతున్న జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు పునాది నుండే విద్యావ్యవస్థ బలోపేతం కావడానికి ఉద్దీపకం వర్క్ బుక్ టు లోని అంశాలు ప్రతి పిల్లవానికి అందరికీ అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
గురువారం నాడు దుమ్ముగూడెం మండలంలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలోని చత్తీస్గడ్ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న లింగాపురం, రాజ గుంపు జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కాసేపు ఉపాధ్యాయుని పాత్ర అనంతరం విద్యార్థి పాత్ర పోషించి ఉద్దీపకం వర్క్ బుక్ సంబంధించిన అంశాలు పిల్లలకు బోధిస్తున్న తీరును మరియు తానే స్వయంగా పిల్లల చేత బోర్డుపై వ్రాయించి వర్క్ బుక్ లోని ప్రతి అంశం పిల్లల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పిల్లలు ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు మరియు చతుర్వేద ప్రక్రియలలో వెనుకబడి ఉన్నట్లు ఆయన గమనించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నెల రోజుల తర్వాత తప్పనిసరిగా ఈ పాఠశాలను సందర్శిస్తానని, ఈ లోపల పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు తప్పనిసరిగా ప్రతి పిల్లవానికి తెలిసి ఉండాలని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ ప్రతిరోజు సక్రమంగా జరగాలని అన్నారు. పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండకుండా చూసి, పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా సంబంధిత ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతిరోజు పిల్లలను తప్పనిసరిగా బడికి పంపించాలని, ఉపాధ్యాయులు ప్రతిరోజు వచ్చేలా చూడాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పై అధికారులు దృష్టికి తీసుకొని రావాలని, ఈసారి ఈ గ్రామం సందర్శించినప్పుడు తప్పనిసరిగా గ్రామంలోని పెద్దలు, పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వాహణ తప్పనిసరిగా పిల్లలు అర్థం చేసుకొని రాసేలా ఉపాధ్యాయులు పిల్లలను ఉత్తేజపరచాలని, సంబంధిత ఎస్సిఆర్పి క్రమం తప్పకుండా ఉద్దీపకంలోని ప్రతి అంశం ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తున్నది లేనిది తనిఖీ చేయాలని, మారుమూల ప్రాంతాలలో ఉన్న జిపిఎస్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి విటల్ బాబు, ఉపాధ్యాయులు శ్రీమతి ముత్తమ్మ, చరణ్ కుమార్, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

19
1273 views