అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 13 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం.
- ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం.
- ల్యాండ్ అక్విసిషన్ పై అంజుమన్ కమిటీ తో చర్చిస్తాం
- అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 13 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం.
- ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం.
- ల్యాండ్ అక్విసిషన్ పై అంజుమన్ కమిటీ తో చర్చించాలని నిర్ణయం.
- షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.
విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 13 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం చేసి, పలు మ్యానేజింగ్ కమిటీలు, ముతవల్లీలను నియమించారు. చిన్న కాకాణి లోని అంజుమన్ ఏ ఇస్లామీయ వక్ఫ్ సంస్థ యొక్క భూముల ల్యాండ్ అక్విసిషన్ విషయంలో అంజుమన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో బోర్డ్ సభ్యులైన శాసన మండలి సభ్యులు రుహుల్లా, శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముక్రం హుస్సేన్, బేపారి జాకీర్ అహమద్, దావూద్ భాషా బఖావి సీఈఓ యాకూబ్ ఖాజీ పాల్గొన్నారు.