logo

కుల వ్యవస్థ ఉన్న చోట సామాజిక ఆదర్శాలు ఉండవు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్......

*కుల వ్యవస్థ ఉన్న చోట సామాజిక ఆదర్శాలు ఉండవు. తత్ఫలితంగా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు.*
*భారత సమాజం కులవ్యవస్థలో ఎంతగా కూరుకుపోయి ఉందంటే ఇక్కడ ప్రతీ అంశం కులపరంగా వ్యవస్థీకృతమై కనిపిస్తుంది. ఒక్కసారి భారత సమాజం లోకి తొంగి చూస్తే కుల వ్యవస్థ ఎంత బలంగా వుందో బోధపడుతుంది. కేవలం తన కులం వాడు కాదన్న ఒకే ఒక్క కారణం వల్ల ఒక భారతీయుడు మరో భారతీయుడితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడదు. అలాగే ఒక కులం కాకపోతే వివాహాలు చేసుకోరు. కులం కారణంగా ఒక భారతీయుడు మరో భారతీయుణ్ని ముట్టుకోను కూడా ముట్టుకోడు. రాజకీయాల వైపు దృష్టి సారించండి. కులం ప్రభావం ఎలాంటిదో మీకే తెలుస్తుంది. ఎన్నికలలో భారత పౌరుడు ఏ ప్రాతిపదిక మీద ఓటు వేస్తాడు? అన్ని రాజకీయ పార్టీల కూడా ఓట్లు దండుకునేందుకు కుల వ్యవస్థను కొల్లగొడుతోంది. వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాని ఒక్కసారి పరిశీలించండి. ఆ నియోజక వర్గంలో ఏ కులం వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ కులానికి చెందిన వ్యక్తినే తన అభ్యర్థిగా ఎంపిక చేస్తుంది.....

*పరిశ్రమల వైపు దృష్టి సారించండి. మీకేం కనిపిస్తుంది? అత్యున్నత స్థాయి అధికారులు, ఎక్కువ జీతాలు పట్టుకునేవాళ్ళు ఆ పరిశ్రమ ఏ కులానికి చెందిన వ్యక్తి ఖచ్చితంగా ఆ కులానికి చెందిన వాళ్ళే అయి ఉంటారు. మిగతా వాళ్ళు ఆ పరిశ్రమలో బొటాబొటి జీతగాళ్ళుగా అట్టడుగున కనిపిస్తారు. వాణిజ్య రంగంలో కూడా మీకు ఇదే దృశ్యం కనిపిస్తుంది. మొత్తం వాణిజ్య వర్గమంతా ఒకే కులానికి చెందిన శిబిరంలా ఉంటుంది అక్కడ ఇతర కులాలకు ప్రవేశం లేదు.*

0
88 views