logo

ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్

*ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్‌స్పెక్టర్*

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి బయటపడింది. మాదాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఫిర్యాదుదారుడి నుంచి కేసు విషయంలో సహకారం అందిస్తానని చెప్పి రూ.50,000 లంచం డిమాండ్ చేసిన వినయ్, ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
లంచం మొత్తం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, వినయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

1
35 views