
సేఫర్ ఇంటర్నెట్ డే – 2026 పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్....
*సేఫర్ ఇంటర్నెట్ డే – 2026 పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
- *అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం ఈనెల 10వ తేదీన జరుపుకునే సేఫర్ ఇంటర్నెట్ డే – 2026 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, ఎన్ఐసీ ఏడీఐఓ టి.భారతి, తదితరులు పాల్గొన్నారు.*
- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సేఫర్ ఇంటర్నెట్ డే థీమ్ “స్మార్ట్ టెక్నాలజీ, సురక్షిత ఎంపికలు – కృత్రిమ మేధస్సు (AI) ను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా వినియోగించడం”గా నిర్ణయించబడిందని తెలిపారు. సేఫర్ ఇంటర్నెట్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రెండవ మంగళవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. ఇంటర్నెట్ మరియు ఏఐను సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సైబర్ హైజీన్‌కు సంబంధించిన ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, సైబర్ ముప్పులు మరియు వాటి నివారణ చర్యలపై విద్య కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో, ISEA ప్రాజెక్ట్ కింద, ఎన్ఐసీ మరియు ఇతర సంస్థల సహకారంతో ఫిబ్రవరి 10, 2026 న దేశవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోంది.*
- *ఈ సందర్భంగా యువ పిల్లలు, విద్యార్థులు, మహిళలు మరియు వృద్ధులు AI డీప్‌ఫేక్‌లు, AI వాయిస్ మోసాలు వంటి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సురక్షితంగా ఇంటర్నెట్ మరియు AI ను వినియోగించాలని ఎన్ఐసీ ఏడీఐఓ టి.భారతి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ రమణ రెడ్డి, ఈ-ఆఫీస్ అసోసియేట్ అనిల్ యాదవ్ పాల్గొన్నారు.*
----------------------------------------------
DIPRO.I&PR.ATP..