logo

కేంద్ర పథకాలు పేదలకు వరం: కాంగ్రెస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు - బిజెపి నేత గుంటుబోయిన కూర్మారావు యాదవ్


విజయనగరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ వికసత్ భారత్ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ ( గ్రామీణ్ వీ బీ జీ రామ్ జీ ) ఈ పథకం కూలీలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసత్ భారత్ (వీ బీ -జీ రామ్ జీ ) ఈ పథకం పేదలకు వరం లాంటిది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పార్టీలు ఉపాధి కూలీలను తప్పుదోవ పట్టిస్తున్నారు కానీ కూలీలకు ఇబ్బంది పెట్టే విధంగా ఏమి జరగలేదు ప్రధాన నరేంద్ర మోడీ గారు పేద కుటుంబాల పుట్టిన వారు కాబట్టి పేదలు ఇబ్బంది తెలుసు కాబట్టి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని గ్రామీణ ప్రజలకు ఏడాదికి 125 పని దినాలు ఉపాధి కల్పించారు గత కాంగ్రెస్ పార్టీ 100 రోజులు మాత్రమే కల్పించింది అవినీతిని అటు ఇటు చేసేందుకు కూలీలు పనిచేసే చోటే హాజరు నుండి జీతం చెల్లింపు వరకు అంతా డిజిటల్ బయోమెట్రిక్ విధానాన్ని అదేవిధంగా వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను తీర్చడం ద్వారా రైతులకు ఉపశమనం కల్పించడం జరుగుతుందని బిజెపి సీనియర్ నాయకులు కూర్మారావు యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు..

2
1492 views