logo

పేద కుటుంబాలకు CMRF చెక్కులు అందించిన పొందూరు మాజీ ఎంపీపీ కూన ప్రమీల

AIMA న్యూస్ శ్రీకాకుళం :
అమదాలవలస నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలో ఈ మధ్య కాలం లో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు వైద్య ఖర్చులు నిమిత్తం మరియు చికిత్స పొందుతూ చనిపోయిన వారి కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ చెక్కులను ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు శ్రీ *కూన రవికుమార్* గారి సతీమణి పొందూరు మండల మాజీ ఎంపీపీ *శ్రీమతి కూన ప్రమీలా* మేడం గారు స్వయంగా లబ్ధిదారులు కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని లబ్దిదారులకి చెక్కులు ఇవ్వడం జరిగినది.

*లబ్ధిదారుల* *వివరాలు*

1.బంటుపల్లి రమేష్ -139000 (తొగరాం)
2.తమ్మినేని రవి -204000(సనపల వాని పేట)
3.వారణాసి లక్ష్మీ 51000(చిన్న జొన్నవలస)
4.జోగి సావిత్రి -108000(తురకపేట)
5.గొల్లి అప్పారావు -149000(కుమ్మరిపేట)
6.మీసాల గణపతి రావు -99000(మునగవలస)
7.లోలుగు నీలం నాయుడు -97000 (కొండవలస)

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే కూన రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు వలే ఆదుకుంటున్నారని శ్రీమతి కూన ప్రమీలా గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-------
టీడీపీ కార్యాలయం
ఆమదాలవలస

14
695 views