logo

దక్షిణ కాశీగా పేరుగాంచిన బలివే క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను అన్ని శాఖల పూర్తిసమన్వయంతో మరింత మెరుగ్గా నిర్వహించండి .

"దక్షిణ కాశీగా పేరుగాంచిన బలివే క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను అన్ని శాఖల పూర్తిసమన్వయంతో మరింత మెరుగ్గా నిర్వహించండి - భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రతి అంశంపై పటిష్టమైన చర్యలు చేపట్టండి: రెవెన్యూ, పోలీస్ సహా పలు శాఖల అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ సూచనలు

పెదవేగి మండలం నడిపల్లి పంచాయతీ పరిధిలో రూ.70లక్షల రూపాయల NREGS నిధులతో బీసీ రోడ్ నుంచి తమిళం బ్రిడ్జి వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన అనంతరం బలివే బ్రిడ్జి వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లను అధికారులతో కలిసి సమీక్షించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు

ప్రమాదవశాత్తు గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో తమ్మిలేరులో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన దుర్ఘటన నేపథ్యంలో, ఈసారి శివరాత్రి ఏర్పాట్లకు మరింత పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలంటూ, అందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించేల చర్యలు చేపట్టాలంటే ఏలూరు రేంజ్ పోలీస్ ఐజి అశోక్ కుమార్ గారిని ఫోన్ ద్వారా కోరిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు..

ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన బలివే పుణ్యక్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాదిమంది భక్తులు కృష్ణా జిల్లా, తెలంగాణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహా అనేక ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని , అటువంటి బలివే పుణ్యక్షేత్రానికి తరలివచ్చే భక్తులకి అదేవిధంగా నిత్యం నూజివీడు నియోజకవర్గం నుంచి దెందులూరు నియోజకవర్గం లోకి విద్యా ఉపాధి ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణించే విద్యార్థులు, రైతులు సమీప గ్రామ ప్రజల సౌకర్యార్థం ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 70 లక్షల రూపాయల నిధులతో ప్రధాన రహదారి నుంచి తమ్మిలేరు బ్రిడ్జి వరకు నూతనంగా తారు రోడ్డు నిర్మించడం జరిగిందని తెలిపారు.. అదేవిధంగా రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పోలీస్ రెవెన్యూ సహా ఇతర శాఖల అధికారులు అంతా సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. రహదారికి సమీపంలోనే ద్విచక్ర మరియు ఇతర వాహనాలకు పార్కింగ్ ప్లేస్ లో కేటాయింపుతో పాటు భక్తులకు త్రాగునీరు అందించడం పారిశుద్ధ్య నిర్వహణ , జన సమర్థ ప్రాంతాల్లో రద్దీ ఏర్పడకుండా చూడటంతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహణ తహ పలు అంశాలు సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో దురదృష్టవశాత్తు తమ్మిలేరులో ఇద్దరు మృత్యువాత పడిన దుర్ఘటన నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారులు ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు మరింత అదనపు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని భారీగా తరలిరానున్న భక్తులు నేపథ్యంలో అవసరమైన పోలీస్ బందోబస్తును ముందస్తుగా సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ గారిని ఫోన్ ద్వారా కోరారు.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలివే పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సహా స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు సైతం సేవలు అందిస్తారని , ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు అందరు సమష్టి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ఘనంగా జరిగేలా ప్రతి ఒక్కరు తమ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు కోరారు...

ఈ కార్యక్రమంలో ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి అచ్యుత అంబరీష్ గారు, పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం రాజశేఖర్ గారు, దెందులూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత గారు, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, విజయరాయి సొసైటీ చైర్మన్ బొప్పన సుధా గారు, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్ గారు, పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ గారు, మండల పార్టీల అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్ గారు, నంబూరు నాగరాజు గారు, మరడాని రవి గారు సహా పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
సహా పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు..

0
0 views