logo

గుట్టకొండ లక్ష్మీ నరసింహ స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన PAC మాన్యులు.

నంద్యాల జిల్లా రుద్రవరం నల్లమల అటవీ ప్రాంత సమీపంలో వెలసిన గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి వారికి విశేష పూజలు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణానికి చెందిన గుబ్బ చంద్రశేఖర్ YSRCP పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ (PAC) పొలిటికల్ అడ్వైసర్ మెంబర్ సోమవారం నాడు రుద్రవరం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన గుట్టకొండ లక్ష్మీ నరసింహ స్వామివారికి పూజారి విశ్వం శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేక పూజలు నిర్వహించి విశేష పూజలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఇంటి దేవుడు గుట్టకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రతి సంవత్సరం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

0
46 views