logo

ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 16 వరకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ప్రతి భక్తుడికి ఉచితంగా 50 గ్రాముల లడ్డు

*బ్రహ్మోత్సవాలలో నాలుగురోజులపాటు లడ్డుప్రసాద వితరణ*

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నాలుగురోజులపాటు భక్తులందరికీ కూడా ఉచితంగా లడ్డు ప్రసాదాలను అందజేయడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనిసవాసరావు సంయుక్తంగా తెలియజేశారు.
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 16వరకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానంతరం ప్రతీ భక్తుడికి కూడా ఉచితంగా 50 గ్రాముల లడ్డు అందజేయబడుతుందన్నారు.శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే ప్రతీ భక్తుడికి లడ్డు ప్రసాదం అందాలనే భావనతో ఈ ఉచిత ప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆలయ వెనుకభాగంలో ఈ లడ్డుప్రసాదవితరణ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
కాగా ఈ నెల 3వ తేదీన మంత్రుల బృందం మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో రాష్ట్రదేవదాయశాఖ మంత్రిఆనంరామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి,శ్రీమతి వి. అనిత,రోడ్లు భవనాల, పెట్టుబడులశాఖమంత్రి బి.సి.జనార్థనరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో నిర్ణయించిన మేరకు గత సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాలను
అందజేయడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియుకార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.ఒక్కొక్క భక్తుడికి50గ్రాముల బరువుగలలడ్డు ప్రసాదం ఇవ్వడంజరుగుతుందన్నారు.
*శీఘ్ర, అతిశీఘ్రదర్శన టికెట్టుదారులకు ఉచిత లడ్డు ప్రసాదం తాత్కాలికంగా నిలుపుదల :*
కాగా ప్రస్తుతం రూ. 500/-ల రుసుమముతో స్పర్శదర్శనం భక్తులకు రెండు లడ్డు ప్రసాదాలు, రూ.150/-లతో కూడిన శీఘ్రదర్శనం భక్తులకు ఒకలడ్డు ప్రసాదం ఉచితంగా అందజేయడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియుకార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.అయితే ఈ బ్రహ్మోత్సవాలలో ఎప్పటి వలనే శీఘ్రదర్శనం టికెట్టు రూ. 200/-లు, అతిశీఘ్రదర్శనం రూ. 500/-లుగాను మార్పు చేయడం జరిగిందన్నారు. భక్తులరద్దీ కారణంగా 30 కౌంటర్లలో లడ్డు విక్రయకేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులరద్దీ కారణంగా మొత్తం 30 లడ్డు విక్రయకేంద్రాలలో నిర్వహించవలసి వున్నందున శీఘ్ర,అతిశీఘ్ర దర్శన భక్తుల ఉచిత లడ్డు ప్రసాద వితరణ బ్రహ్మోత్సవాలలో తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లుగా పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం శీఘ్ర, అతిశీఘ్రదర్శనం టికెట్లకు యథావిధిగా ఉచిత లడ్డు ప్రసాదాలుఅందజేయబడుతాయని తెలిపారు.

16
4385 views