logo

సీఎం చంద్రబాబు లక్ష్యానికి శింగనమలలో శ్రీకారం- ఎమ్మెల్యే బండారు శ్రావణి .....

*ప్రతి మహిళా పారిశ్రామిక వేత్త కావాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి శింగనమలలో శ్రీకారం- ఎమ్మెల్యే బండారు శ్రావణి
*బ్లాక్ రిసోర్ సెంటర్(BRC) నూతన భవనం శింగనమలలో ప్రారంభం.*స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం (SVEP) ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన – ఎమ్మెల్యే బండారు శ్రావణి .*
శింగనమల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నూతన కార్యాలయ భవనాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. డ్వాక్రా సంగాల మహిళలు ఏర్పాటుచేసిన డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించి అక్కడ మహిళలతో మాట్లాడుతూ వారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేశారు.అనంతరం జిల్లా కేంద్రంలోని రూడ్ సెట్ సంస్థ ద్వారా *కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ - ఎంటర్ ప్రెన్యూరు ప్రమోషన్* గురించి శిక్షణ పొందిన మహిళలు కు సర్టిఫికెట్లు ను ఎమ్మెల్యే బండారు శ్రావణి అందచేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని ఎస్.హెచ్.జి. గ్రూపు సభ్యులు కు బాంక్ లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి పథకం ల ద్వారా 4002 మహిళా పొదుపు సంఘాలకు 334.77 కోట్ల రూ.ల చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ NRLM ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం–SERP సహకారంతో అమలవుతున్న కీలక కార్యక్రమమే SVEP. శింగనమల నియోజకవర్గంలో గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ NRLM ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం SERP సహకారంతో అమలవుతున్న స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం (SVEP)ను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు ఇవ్వడం మాత్రమే కాకుండా మహిళల హక్కులు, గౌరవం, భద్రత, స్వావలంబనను సమాజం గుర్తించడమేనని అన్నారు. ఒక మహిళ ఎదిగితే కుటుంబం, సమాజం, దేశం ఎదుగుతుందని, మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో SVEP అమలవుతూ డ్వాక్రా సంఘాలకు ఇప్పటివరకు రూ. 334.77 కోట్లను బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి, ఉన్నతి, CIF పథకాల ద్వారా రుణాల రూపంలో అందజేశామని తెలిపారు.
SVEP ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలను గుర్తించి సుమారు 2000 మందిని ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శిక్షణ, ఆర్థిక మద్దతు, మార్కెటింగ్ సహాయం అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో బ్లాక్ రిసోర్స్ సెంటర్ (BRC) ఏర్పాటు చేసి మహిళలే నాయకత్వం వహిస్తూ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించేందుకు “స్వయం” అనే బ్రాండ్ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు తెలిపారు. స్థానిక మార్కెట్లతో పాటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డ్వాక్రా ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.
స్థానిక అవకాశాలు, వ్యవసాయ–వ్యవసాయేతర ఉత్పత్తుల ఆధారంగా మహిళలకు సుస్థిర జీవనోపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడమే SVEP ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు.

0
35 views