logo

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కి బీసీ సంఘాల నేత జాజుల బహిరంగలేఖ..

ప్రతినిధి-పగిల్ల సందీప్✍️
హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కి బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్ బ హిరంగలేఖ వ్రాసారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకికి గులాబీ పార్టీ అండ గా ఉందని బీసీ సంఘాలు నేత జాజుల శ్రీనివాస్ మండిపడ్డారు.బీసీల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ బీఆర్ఎస్ బీసీ వ్యతిరేకులకు అండగా ఉండడం దురదృష్టకరం అని అన్నారు.బీసీ ద్రోహులను చేరదీస్తూ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో బీసీ ద్రోహుల పార్టీ గా నిలిచిపోతుంది. అని ఏద్దేవా చేసారు.బి ఆర్ఎస్ బీసీల పక్షమా.. బీసీ ద్రోహుల పక్షనన తేల్చాలి అని అన్నారు.బీసీల విషయంలో బీఆర్ఎస్ ముసుకు తొలగింది, బీసీ ద్రోహి అనినటువంటి మాధవరెడ్డికి ఇంధనం సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీని అని తేలిపోయింది 48 గంటల్లోగా బీసీ వ్యతిరేకులను సస్పెండ్ చేయాలి లేకుంటేరాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయలను ముట్టడిస్తాం అని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాసారు.బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీల నోట్లో మట్టి కొట్టిన బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి గుట్టెంగారి మాధవరెడ్డి కి గులాబీ కండువా కప్పి ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకికి గులాబీ పార్టీ అండగా ఉంటుండనడం అని బీసీ సమాజానికి సంకేతం ఇచ్చిన కెసిఆర్ చారిత్రక తప్పు చేసాడని బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ మేరకు నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాజుల లేఖ రాశారు, ఈ మేరకు ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు
బహిరంగ లేఖలో ప్రధాన సారాంశం..
తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం పైగా ఉన్న కోట్లాదిమంది బీసీలు తమకు విద్యా, ఉద్యోగ,రాజకీయ రంగాలలో జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కావాలని దశాబ్దాలుగా పోరాడుతున్న విషయం మీకు తెలియనిది కాదు.ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో తాము అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా,ఉద్యోగ,రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన నిరంతర ఒత్తిడి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణన జరిపి, బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయంలో 42 శాతం రిజర్వేషన్లు పెంచదు అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసిన విషయం మీకు విధితమే బిల్లు పెట్టే సమయంలో చట్టం చేసే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
42% బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 విడుదల చేసింది.ఈ జీవోను సవాల్ చేస్తూ బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి గారు కోర్టులో కేసులు వేసి పెంచిన రిజర్వేషన్లు కోర్టుల ద్వారా కొట్టి వేయించడం జరిగింది
బీసీల నోటి కార్డు ముద్దను గుంజేసి బీసీలు తినే కంచంలో మన్ను పోసిన ఘనుడు మాధవరెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు తగ్గించడం మూలంగా బీసీలు వేలాది సర్పంచ్ స్థానాలను కౌన్సిలర్ కార్పొరేటర్ మున్సిపల్ చైర్మన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కోల్పోయే అవకాశం ఏర్పడింది, బీసీలను తడి గుడ్డతో గొంతు కోసి బీసీలను రాజకీయంగా అణిచేయాలని కుట్రతో 60 శాతంజనాభా ఆకాంక్షలను ఆశలను ఆశయాలను తుంగలోకి తొక్కిన బీసీల ద్రోహి అయినటువంటి మాధవరెడ్డి గారిని ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికలలో ముడిచింతలపల్లి మున్సిపాలిటీ నుండి కేశవాపూర్ పదో వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ ఇచ్చి ఎన్నికల బరిలో మీరు నిలపడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకైనా మాధవ రెడ్డి గారికి గులాబీ కండువా కప్పి బీసీల మనోభావాలను బీసీల ఆత్మ గౌరవాన్ని బీసీల రాజకీయ ఆకాంక్షలను బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని వారికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ద్వారా స్పష్టంగా సందేశం ఇచ్చింది.కారు గుర్తు మీద మాధవరెడ్డిని గెలిపించాలని ఇప్పటికే మీ పార్టీ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.
రాజకీయాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మీరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన మీరు బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకైనా మాధవరెడ్డిని మీకు తెలవకుండా మీ పార్టీలో చేర్చుకోరని మేము బలంగా నమ్ముతున్నాం
బీఆర్ఎస్ పార్టీ బీసీల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన విషయం మీకు బాగా తెలుసు మీరు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడానికి ముందు బిసి బిడ్డ అయిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశీర్వాదంతో, టైగర్ నరేంద్ర అండ దండలతో, కొండ లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిన ఆశ్రయంతో,కాసోజు శ్రీకాంత్ చారి నుండి కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలతో మీ పార్టీ నిలబడిందని విషయం మీకు తెలియనిది కాదు.బీఆర్ఎస్ పార్టీకి లక్షలాదిమంది బీసీలు సభ్యత్వం ఉండి, బీసీలే పార్టీ జెండా మోసి మీకు జిందాబాద్ లు కొట్టి మీకు జేజేలు పలికిన బీసీలకు మీరిచ్చిన బహుమానం బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి బీసీలకు కానుకగా ఇచ్చినట్టుగా బీసీలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షన రిజర్వేషన్ వ్యతిరేకుల పక్షము అని చర్చకు వచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల పక్షమే అనే సంకేతాన్ని మాధవరెడ్డి రూపంలో తెలియజేసినందుకు సదా మీకు కృతజ్ఞతలు.ఇన్ని రోజులు బీసీ రిజర్వేషన్లను గండి కొట్టిన మాధవరెడ్డికి ఎవరి అండదండలు ఉన్నాయో అని బీసీ సమాజం తీవ్ర సందిగ్ధంలో ఉండే, కానీ ఈరోజు మాధవరెడ్డి ముసుకు తొలగిపోయింది మాధవరెడ్డికి రిజర్వేషన్లు మీద పోరాడడానికి ఇంధనం సమకూర్చి వెనకా ముందు తామే ఉన్నామని అలాగే బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నందుకు కానుకగా కౌన్సిలర్ పదవిని అప్పనంగా కట్టబెట్టాలని మీ పార్టీ ప్రయత్నించినందుకు మీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం.నిజంగా బీ ఆర్ఎస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకైన మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది.బీఆర్ఎస్ పార్టీ బీసీల వైపు న్యాయం ఉందని భావిస్తే మీరు చేసిన ఈ బీసీ విద్రోపు చర్యను తక్షణమే ఉపసంహరించుకొని బీసీ సమాజానికి క్షమాపణ కోరి బీసీల పక్షాన నిలబడాలని మిమ్ములను కోరుతున్న.మీ నిర్ణయం 48 గంటల్లో వెల్లడిస్తారని ఆశిస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీల పక్షాన ప్రజాస్వామ్యుతంగా మీ బీసీ వ్యతిరేక వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పూలుకొని మీ బీసీ వ్యతిరేక వైఖరి రాష్ట్రంలోని గ్రామ గ్రామాన ఎండగడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ లో పేర్కొన్నారు.

0
0 views