logo

అనంతపురం జిల్లాలో 551 అక్రిడిటేషన్ లు మంజూరు.......

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తాం..

- అనంతపురం జిల్లాలో 551 అక్రిడిటేషన్ లు మంజూరు

కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్
జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తామని కలెక్టర్ మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో ఐ.అండ్.పీఆర్ (జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ) ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశాన్ని కమిటీ ఎక్స్ అఫిషియో సభ్యులు మరియు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ మరియు డిఎంఏసి మెంబర్ కన్వీనర్ ఏ.బాలకొండయ్యతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో తొలి విడతగా 551 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. ఇందులోభాగంగా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఆలోచించి అర్హత కలిగిన వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరగా, క్రమం తప్పకుండా పత్రికలు, పీరియాడికల్స్ డిఐపిఆర్ఓ కార్యాలయానికి అందచేయాలని, నిజాయితీగా ఉండే వాళ్లకి, ఎలాంటి తప్పులు చేయని వారికి నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఎస్.మహమ్మద్ అయుఫ్, ఏ.షఫీఉల్లా, సి.రవికుమార్, సి.ప్రతాప్, కె.అనిల్ కుమార్ రెడ్డి, కే.మల్లికార్జునరావు, వి.రామకృష్ణుడు, బి.సురేష్ బాబు, జి.చంద్రశేఖర్, ఎస్ఎండి.రసూల్, ఆర్.రామంజినేయులు, ఆర్విఎస్.ప్రసాద్, డిఎంహెచ్ఓ కార్యాలయం డిఎంఈఓ, లేబర్ కార్యాలయం ఏసీఎల్ లావణ్య, హౌసింగ్ శాఖ మేనేజర్, ఏపీఎస్ఆర్టీసీ పీవో, ఐ.అండ్.పీఆర్ ఏపీఆర్ఓ ఫక్రుద్దీన్, పిఆర్ఓ వి.సూర్యనారాయణ రెడ్డి, టైపిస్ట్ దామోదర్ రెడ్డి, టెక్నీషియన్ కమల్, తదితరులు పాల్గొన్నారు.

0
0 views