నకిలీ ఎస్‌ఐ పేరుతో సైబర్ బెదిరింపులు...15 లక్షల రూపాయలు మోసం... ఇద్దరు నిందితుల అరెస్ట్..... ఆళ్లగడ్డ డీఎస్పీ K.ప్రమోద్
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
నకిలీ ఎస్‌ఐ పేరుతో సైబర్ బెదిరింపులు...15 లక్షల రూపాయలు మోసం... ఇద్దరు నిందితుల అరెస్ట్..... ఆళ్లగడ్డ డీఎస్పీ K.ప్రమోద్
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీసు అధికారి K.ప్రమోద్ పర్యవేక్షణలో కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ P. హనుమంత్ నాయక్ కోయిలకుంట్ల పోలీసు స్టేషన్ సైబర్ క్రైమ్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగింది.
నిందితులు :
1. A. చంద్రశేఖర్ @ అక్కపల్లి చంద్రశేఖర్, వయస్సు : 32 సంవత్సరాలు, తండ్రి: చెన్నయ్య, కులం- మున్నూరు కాపు, ఇంటి నెంబర్ 3-111, హన్వాడ గ్రామం మరియు మండలం, మహబూబ్ నగర్ జిల్లా. ప్రస్తుతము పాత బస్టాండు వెనక, జవహర్ నగర్ కాలనీ, జడ్చర్ల, తెలంగాణ రాష్ట్రం.
2. దాసరి సందీప్ కుమార్, వయస్సు 27 సం,,లు, తండ్రి: దాసరి బాలరాజు, కులం: మున్నూరు కాపు, డోర్ నెంబర్ 5-110/2, స్టేట్ బ్యాంకు వెనకాల, హన్వాడ, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం