logo

భక్తులు తమ వాహనాలు ఇతరులకు ఆటంకం లేకుండా పార్కింగ్ చేసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి

ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ శాఖల సమన్వయంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి.
భక్తులు ఇతరులకు ఆటంకం లేకుండా పోలీసు వారి సూచనలను పాటిస్తూ తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి.

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS .

నంద్యాల జిల్లా శ్రీశైలం నందు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శనం నిమిత్తంవచ్చే భక్తుల భద్రతనుదృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి
ఆటంకాలు,అవాంఛనీయ సంఘటనలు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ,సునీల్ షొరాణ్ IPSపోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతోసమావేశం నిర్వహించడం జరిగింది .అనంతరం శ్రీశైలం నందు భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తీసుకునే చర్యలలో భాగంగా శ్రీశైలం నందు గల పార్కింగ్ ప్రదేశాలను అనగా రింగ్ రోడ్డు వద్ద గల పార్కింగ్ ప్రదేశాలను,RTCబస్టాండ్, సాక్షి గణపతి,హటకేశ్వరం,సుండిపెంట గ్రామంనందులింగాల గట్టుమొదలగుప్రదేశాలలో స్వయంగాపర్యటించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండాచర్యలుతీసుకోవాలని,మరియు లింగాలగట్టుస్నానఘాట్ లనుకూడాపరిశీలించి
సంబంధితఅధికారులకు దిశానిర్దేశంచేయడంజరిగింది.ఈసందర్భంగాజిల్లాఎస్పీమాట్లాడుతూభ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తంవిచ్చేయు భక్తులు పోలీసువారి సూచనలను
పాటిస్తూతమవాహనాలనుఇతరులకుఆటంకంలేకుండాపార్కింగ్ చేసుకోవాలని,రోడ్డుకుఇరువైపులాఎట్టి పరిస్థితుల్లోపార్కింగ్చే
యరాదనివిజ్ఞప్తిచేశారు.

1
0 views