logo

మాకవరపాలెం కేజీబీవీ విద్యార్థిని రాష్ట్ర స్పెల్ బీలో రెండో స్థానం

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న మాసారపు లక్ష్మి లావణ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన స్పెల్ బీ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించింది.అమరావతిలో జరిగిన ఈ పోటీల్లో జోనల్ స్థాయి నుంచి ఎంపికై రాష్ట్రస్థాయికి చేరిన లక్ష్మి లావణ్య స్టేట్ ఎస్సిఈఆర్టీ డైరెక్టర్ చేత పతకం, ప్రశంసాపత్రం అందుకుంది. తమ పాఠశాల విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్)లు అభినందించారు. మాకవరపాలెం ఎంఈవో , కేజీబీవీ ఎస్వో తదితరులు కూడా ఆమె విజయాన్ని ప్రశంసించారు.లక్ష్మి తండ్రి రమణ మాట్లాడుతూ, "కూతురు సాధించిన ఈ రాష్ట్రస్థాయి విజయం మాకు అపార గర్వకారణం. దీనికి కారణమైన ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.ఈ విజయంతో స్థానికంగా లక్ష్మి లావణ్య పేరు చర్చనీయాంశమైంది. పాఠశాల సిబ్బంది ఆమె భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని ఆకాంక్షించారు

4
562 views