logo

నకిలీ స్టిక్కర్ల ఆటకట్టు: పోలీస్, ప్రెస్, అడ్వకేట్ బోర్డులపై సర్కార్ ఉక్కుపాదం!

వాహనాలపై పోలీస్, ప్రెస్, అడ్వకేట్ వంటి వివిధ హోదాల స్టిక్కర్ల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. నంబర్ ప్లేట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని హెచ్చరించారు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై 'ప్రెస్' అనే పదాన్ని ఉపయోగించాలన్నారు.

22
1490 views