మెట్‌పల్లిలో డెల్టా కేర్ డైగ్నోస్టిక్ సెంటర్‌ను సందర్శించిన జువ్వాడి కృష్ణారావు
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) జనవరి 26 :
మెట్‌పల్లి పట్టణంలో గల డెల్టా కేర్ డైగ్నోస్టిక్ సెంటర్‌ను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న వైద్య పరీక్షలు, సదుపాయాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. స్థానిక ప్రజలకు ఈ డైగ్నోస్టిక్ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆయన అన్నారు.