
సి ఎస్ ఆర్ సమ్మిట్ లో పాల్గొనె బృందం ప్రతినిధులకు సౌకర్యాలు కల్పించి కార్యక్రమం విజయవంతం విజయవంతం చేయండి
**భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్**
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**
*భద్రాచలం ఐటీడీఏ**జనవరి 25 **ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
సి ఎస్ ఆర్ సమ్మిట్ లో పాల్గొనె బృందం ప్రతినిధులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి కార్యక్రమం విజయవంతం అయ్యేలా సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను ప్రత్యేక బాధ్యతతో నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
ఆదివారం నాడు సి ఎస్ ఆర్ సమ్మిట్ జరిగే గిరిజన భవనం ఆయన పరిశీలించారు. సి ఎస్ ఆర్ సమ్మిట్ నిర్వహణకు బృందం సభ్యులు సూచించిన విధంగా అధికారులు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజనుల స్థితిగతులను మరియు గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడానికి బృందం సభ్యులు పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బృందం సభ్యులకు పలు సూచనలు ఇస్తూ మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో ఎక్కువ శాతం నిరుపేదలైన గిరిజనులకు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందడానికి తక్కువ పెట్టుబడితో గ్రామాలలో సహజంగా దొరికే వనరులతో బయోచ్చార్, మట్టితో సిమెంట్ ఇటుకల తయారీ, చేపల పెంపకం యూనిట్లపై అవగాహన కల్పించామని, ప్రస్తుతం గిరిజనులు సొంతంగా యూనిట్లు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారని, అలాగే కేజీబీవీ పాఠశాల, పీఎంశ్రీ పాఠశాల, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను సందర్శించాలని బృందం సభ్యులకు సూచించారు.
సి ఎస్ ఆర్ బృందం సభ్యులు ఏర్పాట్లు చేసే స్టాల్స్ తో పాటు ఐకెపి ఎస్ హెచ్ జి డి ఆర్ డి ఏ మహిళలకు సంబంధించిన స్టాల్స్ వచ్చే ప్రజలకు అధికారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు సూచించిన ప్రకారము ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
ఈనెల 27న సి ఎస్ ఆర్ సమ్మిట్ ప్రారంభమవుతున్నందున సోమవారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఆర్ ఐ కీర్తి, ఏపీఎం త్రిగుణ, డిఆర్డిఏ ఏపీఎం ప్రసాద్ జిపీఈవో శ్రీనివాస్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.