logo

ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో విస్తృత తనిఖీ.

నంద్యాల (AIMA MEDIA): జిల్లా ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి సూచనలతో నంద్యాల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల RTC బస్టాండ్ నందు పోలీసు సిబ్బందితోపాటు పోలీస్ జాగిలాలతో మరియు బాంబు స్కార్డ్ బృందంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంగణంతో పాటు, పార్శిల్ కార్యాలయం, బైక్ ల పార్కింగ్ ప్రదేశాల దగ్గర తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మట్లాడుతూ ప్రజల రక్షణ భద్రతే లక్ష్యంగా బస్టాండ్ లో ఎటువంటి అసాంఘిక ఘటనలు జరగకుండా , అసాంఘిక శక్తులను అణచివేసేందుకు ముందస్తుగా తనిఖీలు నిర్వహించామన్నారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ కనిపిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ అధికారులకు కానీ 100,112 టోల్ ఫ్రీ నంబర్లకు కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని విజ్ఞప్తి చేశారు.

5
829 views